ఏడేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి.. అత్యాచారం చేసిన నిందితుడిని కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్‌లో నివాసముంటున్న ఓ కుటుంబంలోని ఏడేళ్ల బాలికపై అదే కాలనీకి చెందిన కారుపాకల రాజు అనే యువకుడు జూన్ 10న మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయికి బింగో ప్యాకెట్ కొనిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
విషయం తెలిసిన బాధితురాలి తల్లి పట్టణ సీఐ మాధవిని ఆశ్రయించి విషయం చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు రాజుపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సీఐ మాధవి తెలిపారు. రాజును అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్టు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.
ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం