ETV Bharat / state

కరీంనగర్​లో వాహన తనిఖీలు.. 39 ద్విచక్రవాహనాలు సీజ్

శబ్ధ కాలుష్య నివారణలో భాగంగా కరీంనగర్​ జిల్లా కేంద్రంలో సీపీ కమలాసన్​ రెడ్డి ఆదేశాల మేరకు.. పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. నిబంధనలు పాటించకుండా నడుపుతున్న వాహనాలను సీజ్​ చేసి... జరిమానాలు విధించారు. నెంబర్​ ప్లేట్​ లేని వాహనాలు సీజ్​ చేసి... వాటి యజమానులపై చీటింగ్​ కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు.

vehicle checking in Karim nagar
కరీంనగర్​లో వాహన తనిఖీలు.. 39 బైకులు సీజ్
author img

By

Published : Oct 22, 2020, 10:23 PM IST

కరీంనగర్ జిల్లా కేంద్రంలో సీపీ కమలాసన్​ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్​ సీఐ తిరుమల్​, నాగార్జున రావు, ఎస్సై వెంకటరాజం, విజయ్​కుమార్​, నరేశ్​​, దత్తు ప్రసాద్​లు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించారు. పట్టణంలో నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న వాహనాలను తనిఖీలు చేసి... 39 వాహనాలను సీజ్​ చేసి.. జరిమానాలు విధించారు.

సైలెన్సర్లు తొలగించి... కొత్తగా మోడలింగ్​ చేయించిన వాహనాలు, నెంబర్​ ప్లేట్​ సరిగ్గా లేని వాహనాలను అదుపులోకి తీసుకొని సీజ్​ చేశారు. నెంబర్​ ప్లేట్​ టాంపరింగ్​ చేసిన వాహనాలను సీజ్​ చేసి.. వాటి యజమానులపై చీటింగ్​ కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్​ సీఐ తిరుమల్​ గౌడ్​ హెచ్చరించారు. ఎక్కువ జరిమానాలు ఉంటే వెంటనే క్లియర్​ చేసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి: నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: మంత్రి హరీశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.