ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతోంది. గురువారం సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
రాత్రి 2. 30 గంటలకు లక్ష్మీసమేత యోగ, ఉగ్ర, నరసింహ స్వామి మూల విరాట్లకు మహాక్షీరాభిషేకం ఉంటుందని అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ఆసీనులైన స్వామి వార్లకు పుష్పవేదికపై నివేదనలు, ప్రత్యేక పూజ.. అనంతరం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని వెల్లడించారు.
ఇదీ చదవండి: యాంటీ వైరల్ ఫ్యాబ్రిక్‌ను రూపొందించిన హైదరాబాదీ