సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న క్రమంలో రైతు సోదరులు తెరాస బలపర్చిన అభ్యర్థులను డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కరీంనగర్ జిల్లాలో ఏకగ్రీవంగా గెలిచిన డైరెక్టర్లు, పలువురు తెరాస నాయకులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
నియోజకవర్గంలోని ఆరు మండలాల సొసైటీల్లో మరింత అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో రైతులు సహకార సంఘాల డైరెక్టర్లలను ఏకగ్రీవంగా నియమించుకున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా గెలిచిన డైరెక్టర్లను బాలకిషన్ శాలువాతో సన్మానించారు.