కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు చురుగ్గా సాగుతోందని ఉమ్మడి జిల్లా తెరాస పార్టీ ఇంఛార్జ్ బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. నగర మేయర్ వై.సునీల్ రావు, సుడా ఛైర్మన్ జీ.వి రామకృష్ణ, తెరాస పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
డివిజన్ వారిగా అయిన సభ్యత్వ నమోదు సంఖ్య, పార్టీ బలోపేత అంశాలపై మేయర్ సునీల్ రావుతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన గడువు ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 6.50 లక్షల సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.
ఇదీ చదవండి:అమెరికాలో 5 లక్షలకు చేరిన కరోనా మరణాలు