ETV Bharat / state

ఎంపీ బండి సంజయ్​ కనిపించటం లేదు.. పీఎస్​లో తెరాస ఫిర్యాదు - telangana news

ఎంపీ బండి సంజయ్​ కనిపించటం లేదంటూ తెరాస నాయకులు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ ఎంపీగా గెలిచి రెండున్నరేళ్లు పూర్తి అయినా మానకొండూర్ నియోజకవర్గానికి ఒక్క పైసా నిధులు కూడా తీసుకురాలేదని స్థానిక తెరాస నాయకులు విమర్శించారు.

ఎంపీ బండి సంజయ్​ కనిపించటం లేదు.. పీఎస్​లో తెరాస ఫిర్యాదు

author img

By

Published : Dec 19, 2021, 10:38 PM IST

కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గత రెండున్నరేళ్లుగా కనబడటం లేదని .. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీసు స్టేషన్​లో స్థానిక తెరాస నాయకులు వంతడ్పుల సంపత్, పొన్నం అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ ఎంపీగా గెలిచి రెండున్నరేళ్లు పూర్తి అయినా మానకొండూర్ నియోజకవర్గానికి ఒక్క పైసా నిధులు కూడా తీసుకు రాలేదని విమర్శించారు. తెరాస ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు.

తెలంగాణ రైతుల పట్ల భాజపా నాయకులకు చిత్తశుద్ధి కరవైందని విమర్శించారు. ఇప్పటికైనా మానకొండూరు నియోజకవర్గానికి అధిక నిధులు సమకూర్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

ktr tweet on modi pic : 'ఎన్నికలు ఉంటే కూలీలతో కలిసి భోజనం.. లేకపోతే..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.