ETV Bharat / state

విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన.. సీఎండీ ప్రభాకర్​ - ఎంపీ లక్ష్మీకాంతారావు

సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు రాష్ట్రంలో 24గంటలు కరెంటును నిరంతరాయంగా అందిస్తున్నామని ట్రాన్స్​కో-జెన్​కో సీఎండీ ప్రభాకర్​రావు గుర్తుచేశారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో జరిగిన విద్యుత్ ఉపకేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

transco cmd Prabhakar Rao inaugurated the power sub station in saidapur karimnagar
విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించిన.. సీఎండీ ప్రభాకర్​రావు
author img

By

Published : Jan 24, 2021, 5:50 PM IST

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో 10కేవి విద్యుత్ ఉపకేంద్రాన్ని ట్రాన్స్​కో-జెన్​కో సీఎండీ ప్రభాకర్​రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే సతీశ్​కుమార్ పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు రాష్ట్రంలో 24గంటలు కరెంటును నిరంతరాయంగా అందిస్తున్నామన్నారు ప్రభాకర్​. అందుకోసం ప్రభుత్వం రూ. 12నుంచి 13వందల కోట్లను ఖర్చు చేస్తోందని వివరించారు.

రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఒక్క హుజురాబాద్ డివిజన్​లోనే అత్యధిక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఉపకేంద్రాలు ఉన్నాయని సీఎండీ పేర్కొన్నారు. హుస్నాబాద్​లో 220కేవి విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణం పూర్తి కావొస్తుందని అన్నారు. ఈ అభివృద్ధికి సహకరించిన ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: సేంద్రియ సాగు: పెట్టుబడి కొంచెం.. లాభాలు ఘనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.