కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని కాళేశ్వరం ప్రాజెక్టు సొరంగ మార్గాన్ని శిక్షణ ఐఏఎస్‌లు, గ్రూప్ -1 అధికారులు సందర్శించారు. ఎనిమిదో ప్యాకేజీలో భాగంగా సర్జ్‌పూల్, పంపుసెట్ల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణ ప్రత్యేకతలను ఈఈ శ్రీధర్ వారికి వివరించారు. ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో అధికారులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరి వెంట ఆర్డీవో ఆనంద్‌కుమార్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం అధికారులు ఉన్నారు.
ఇవీ చూడండి: భాగ్యనగరానికి నీటి ముప్పు తప్పదా..!