3days baby dies in maternal care centre in karimnagar: ఆడబిడ్డ పుట్టిందని తెలియగానే ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందని సంబరాల్లో మునిగిన ఓ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లక్షట్ పేటకు చెందిన కృష్ణ, హర్షిణి దంపతులు ప్రసవం కోసం కరీంనగర్ జిల్లాలోని నవజాత శిశువు ఆరోగ్య కేంద్రానికి గత మూడు రోజుల క్రితం వచ్చారు. 3 రోజుల హర్షిణి ఆడపిల్లకు జన్మనివ్వడంతో ఆ ఇంట్లో ఆనందానికి అవధులు లేవు. పుట్టిన పాప రెండున్నర కిలోలతో ఆరోగ్యకరంగా ఉందని చెప్పిన వైద్యులు ఈరోజు(బుధవారం) ఉదయం.. తల్లికి కరోనా సోకడంతో పాప మరణించిందని చెప్పారు. శిశువు మృతి చెందడంతో బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందని కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
తల్లికి కొవిడ్ సోకిందని అందువల్ల పాప మరణించిందని వైద్యులు ఈరోజు 11 గంటలకు చెప్పారు. దీంతో బంధువులు ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. ఆసుపత్రిలో ఉన్న టీవీని ధ్వంసం చేశారు. ఆసుపత్రిలో ఆందోళన చేసినప్పటికీ ఆసుపత్రి సూపరిటెండెంట్ రత్నమాల ఫోన్ చేసినప్పటికీ ఫోను ఎత్తకపోవడంతో శిశువు తరపు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో చేపట్టారు.
దాదాపు గంటసేపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న వారిని పక్కకు తప్పించారు. తమ శిశువు వైద్యుల నిర్లక్ష్యంతోనే మరణించిందని ప్రభుత్వం పేదవారి కోసము ప్రభుత్వ ఆసుపత్రులు కట్టించారని చెప్పుకుంటూ పబ్బం కడుతున్నారని బంధువులు ఆరోపించారు. మాటకే ప్రభుత్వ ఆసుపత్రి కానీ లోపల మాత్రం పైసలు లేనిదే పనులు జరగడం లేదని బంధువులు ఆరోపించారు. తల్లి హర్షిణి పాప మృతి చెందని చెప్పినప్పటికీ తన పాప బతికే ఉందని తిరిగి వస్తుందని పిచ్చిపిచ్చిగా మాట్లాడడంతో బంధువులు ఆందోళన చెందారు.
"ఉదయం పాపకు పొట్ట కొంచెం టైట్‌గా ఉందని ఆస్పత్రికి తీసుకొచ్చాం. డాక్టర్లు డ్యూటీలో లేరు. ఆస్పత్రిలో ఉన్న సిస్టర్ కొంచెం జ్వరంగా ఉందని పాపకు ఏవో డ్రాప్స్ వేశారు. తర్వాత పాపను బయటకు తెచ్చి ఎండలో కాసేపు పెట్టాం. అప్పటిదాకా ఆక్టివ్‌గానే ఉంది పాప. పాపకు ఏం సిరప్ ఇచ్చారో తెలియదు కానీ.. పాప చనిపోయిందని వెంటిలెటర్‌పై పెట్టేశారు. 3రోజుల పాప 2.5కేజీలు పుట్టింది. పాప ఆరోగ్యంగానే ఉందని పుట్టినప్పుడు డాక్టర్లు చెప్పారు. ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారని తీసుకొచ్చాం. కానీ, ఇక్కడ ఏం బాలేదు. డాక్టర్లు సరిగ్గా ఉండటంలేదు. బయట ఆస్పత్రులలో డ్యూటీలు చేసుకుంటూ ఆస్పత్రికి సరిగ్గా రావటంలేదు. మొత్తం లంచమే నడుస్తుంది ఇక్కడ. మొత్తం అన్యాయమే జరుగుతోంది ఇక్కడ. డెలివరీకి మాత్రం మాతాశిశుకేంద్రానికి రావొద్దు."_విష్ణు, నవజాత శిశువు తండ్రి
ఇవీ చదవండి: