ETV Bharat / state

కరోనా యోధులు.. ఈ సారథులు - telangana corona deaths

జిల్లాల్లో కొవిడ్‌ ఆసుపత్రులకు సారథులు వీరు.. గత ఏడాది కరోనా మొదటి దశ నుంచి ఈ ఏడాది రెండో వెల్లువ వరకు కొన్ని వందలమంది రోగులకు చికిత్స చేసిన ‘ముందు వరస యోధులు’. కొత్తరకం వైరస్‌ కావడం.. ఎలా సోకుతుందో, ఎటువైపు నుంచి కమ్మేస్తుందో కూడా తెలియని పరిస్థితి. ప్రజలకే కాదు వైద్యులకూ అవగాహనలేని కాలం.. దానికితోడు మహమ్మారిపై భయంభయం. అయినా సిబ్బందికి ధైర్యం చెబుతూ వారిని ముందుండి నడిపించారు. కొందరు తామూ ఈ వైరస్‌ బారిన పడి కోలుకున్నారు. మనమంతా మొదటిదశ తగ్గుముఖం పట్టగానే కరోనాను ఆదమరవడం, సరైన జాగ్రత్తలు  పాటించకపోవడమే రెండో వెల్లువకు కారణమని వారంటున్నారు. ఎంతోమంది బాధితులు మృత్యుముఖం నుంచి కోలుకొని ఇంటికెళ్తున్నప్పుడు వారి కళ్లలో కనిపించే ఆనందం జీవితంలో ఎంతో సంతృప్తినిస్తుందని అంటున్న మూడు ప్రధాన ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పంచుకున్న అనుభవాలివి..

they-affected-by-corona-and-they-recover-again-they-giving-treatment-to-corona-patients
కరోనా యోధులు.. ఈ సారథులు
author img

By

Published : May 2, 2021, 7:07 AM IST

ఎందరినో కాపాడా.. అమ్మను దక్కించుకోలేకపోయా

మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రామ్‌కిషన్‌

‘‘గత ఏడాది కాలంలో మా వద్ద 12వేల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. ఆసుపత్రిలో చేరిన వారిలో 90 శాతానికి పైగా ఆరోగ్యవంతులయ్యారు. వారు కోలుకొని ఇంటికెళ్తూ చేతులెత్తి మొక్కి.. తమకు మళ్లీ జన్మనిచ్చారంటూ కృతజ్ఞతతో కళ్లనీళ్లు పెట్టుకునే వారు ఎందరో. వృత్తిరీత్యా ఇవి ఎంతో సంతృప్తినిస్తాయి. కొందరు ఆలస్యంగా ఆసుపత్రికి రావడం వల్ల.. ఇతర జబ్బులు తీవ్ర స్థాయిలో విజృంభించడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటివి బాధకలిగిస్తాయి. ఎందరినో ఈ మహమ్మారి కోరల్లోంచి కాపాడగలిగాం కాని.. మా అమ్మను మాత్రం దక్కించుకోలేకపోయా. కరోనాకు చికిత్స పొంది కోలుకొని ఇంటికొచ్చాక.. కొవిడ్‌ దుష్ఫలితాల కారణంగా గుండెపోటు వచ్చి చనిపోయారు. ఆ బాధ ఎప్పుడూ వేధిస్తుంది. తలచుకుంటే ఇప్పటికీ కళ్ల నీళ్లు వస్తున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ధర్మకారి రామ్‌కిషన్‌. ఇక్కడే ఆర్థోపెడిక్‌ ఆచార్యులుగా పనిచేస్తున్న ఆయన కొవిడ్‌ చికిత్సలపై తమ అనుభవాలను పంచుకున్నారు.

కొవిడ్‌ ఉధ్ధృతిలో జిల్లా ఆసుపత్రి సేవలు ఎలా

తొలిదశలోనే మేం కొంత ముందుచూపుతో వ్యవహరించాం. జనవరి 2020లోనే ఫీవర్‌ క్లినిక్‌ అని పెట్టి పరీక్షించడం మొదలెట్టాం. ఫిబ్రవరి 15 నాటికి 20 పడకలతో ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. మార్చి, ఏప్రిల్‌లో పాజిటివ్‌ కేసులు రావడంతో.. పడకల సంఖ్యను 50కి పెంచాం. జులై, ఆగస్టులో రాష్ట్రంలో కరోనా ఉధ్ధృతంగా ఉన్న రోజుల్లోనూ.. మా దగ్గర గరిష్ఠంగా 80 పడకల్లో రోగులు చికిత్సలు పొందారు. ఈ సంవత్సరం ఈ మార్చి నుంచి రెండోదశ మొదలైంది. జాతరలు, పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఎన్నికలు, సభలు, సమావేశాల ఫలితంగా క్రమేణా వైరస్‌ వ్యాప్తి అధికమైంది. మార్చిలో ఒక్కరోజులో 100 కేసులు వచ్చేది కాస్తా.. ఏప్రిల్‌లో ఒక్కరోజులో 600 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో 200 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తంగా 290 ఆక్సిజన్‌ పడకలు, 60 ఐసీయూ వెంటిలేటర్‌ పడకలున్నాయి. మరో 200 పడకలకు త్వరలోనే ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించబోతున్నాం.

రెండోదశ ఉధ్ధృతి ఇంతగా విరుచుకుపడడానికి కారణాలేమిటి

మొదటి దశలో ప్రజలు చాలా జాగ్రత్తగానే ఉన్నారు. వైద్యుల సూచనలను పాటించారు. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. రెండోదశకొచ్చేసరికి పరిస్థితి మారింది. పరీక్షలు కావాల్సినన్ని చేయగలుగుతున్నాం. చికిత్సపై అవగాహన వచ్చింది. మౌలిక వసతులు కూడా మెరుగయ్యాయి. వ్యాక్సిన్‌ వచ్చింది. ఇన్ని వసతులు అందుబాటులో ఉన్నా కొవిడ్‌ను అదుపు చేయలేకపోతున్నాం. ఇందుకు కేవలం ప్రజల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. కొవిడ్‌ నియంత్రణలో వ్యవస్థలోనే లోపం ఉంది. కనీస జాగ్రత్తలు మరిచారు.

కొవిడ్‌ బారినపడినా వైద్యసిబ్బంది తిరిగి విధుల్లో చేరుతున్నారు

తొలిదశలో 70 మంది వైద్యసిబ్బంది కొవిడ్‌ బారినపడ్డారు. అదృష్టవశాత్తు అందరం కోలుకున్నాం. తిరిగి విధుల్లో చేరాం. రెండోదశలో కేవలం నెల రోజుల వ్యవధిలో ఇప్పటికే 200 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇందులో నేను కూడా ఉన్నా. రెండోసారి నా పరిస్థితి విషమించింది. అత్యవసరంగా నిమ్స్‌లో చేరి చికిత్స పొందాను. నేనూ చావు అంచుల దాకా వెళ్లి వెనక్కి వచ్చాను. మా సిబ్బంది అంకితభావానికి నా సలాం.

రోజూ యుద్ధమే చేస్తున్నాం

నిజామాబాద్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా।।ప్రతిమారాజ్‌

‘‘కరోనా వచ్చినా లక్షణాలు కనపడని వారి సంఖ్య 90 శాతానికి పైగా ఉంది. లక్షణాలు ఉన్న మిగిలిన పది శాతందే ప్రధాన సమస్య. మొదటి వేవ్‌లో ఈ పది శాతంమంది పరిస్థితి నెమ్మదిగా తీవ్రమయ్యేది. కాని ప్రస్తుతం వేగంగా దెబ్బతింటోంది. వీరికి వేగంగా తగిన వైద్యం అందాలి. వారిని కాపాడేందుకు రోజూ యుద్ధం చేసినట్లుగా మా వైద్యులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారు’’ అని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ అభిప్రాయపడ్డారు. కరోనా మొదటి వేవ్‌ సమయంలో ఆమె నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రిలో కొవిడ్‌ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. తెలంగాణలో గాంధీ ఆసుపత్రి తర్వాత పెద్ద ఎత్తున కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లో నిజామాబాద్‌ ఒకటి. ఉమ్మడి అదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలు, కరీంనగర్‌తో పాటు మహారాష్ట్ర నుంచి కూడా ఈ ఆసుపత్రికి అధిక సంఖ్యలో కరోనా రోగులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత, అనుభవాలు, జాగ్రత్తలు తదితర అంశాలపై ఆమె పలు విషయాలు వెల్లడించారు.

మీ పరిశీలన ప్రకారం కొవిడ్‌ మొదటి దశకు రెండో ఉద్ధృతికి తేడా ఏంటి

రెండోదశలో వ్యాప్తి తీవ్రత చాలా ఎక్కువ. గతంలో కుటుంబంలో ఒకరికి పాజిటివ్‌ వచ్చినా కొన్నిచోట్ల మాత్రమే ఇంట్లో మొత్తానికి వచ్చేది. ఇప్పుడు అలా కాదు ఒకరికి వస్తే కుటుంబం మొత్తానికి వస్తోంది. సమూహాల్లో అధిక సమయం ఉన్నవారికి వైరస్‌లోడ్‌ ఎక్కువని గమనించాం. షాపింగ్‌ మాల్స్‌, ఎక్కువ సమూహాలు ఉన్నచోటుకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. మాకు అంతా బాగుంది, ఏమీ కాదులే అనుకొనేవారి సంఖ్య పెరిగింది. దీనివల్ల కూడా కొందరి పరిస్థితి తీవ్రమవుతోంది.

వ్యాక్సిన్‌ తీసుకున్నా కరోనా బారిన పడుతున్నారు కదా

నేను కూడా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నా. ఏప్రిల్‌ 12న రెండోసారి కరోనా సోకింది. మొదట్లో ఆసుపత్రిలోనే ఐసొలేషన్‌లో ఉండి పని చేశా. ప్రస్తుతం ఇంట్లో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా. మా ఆసుపత్రిలో దాదాపు అందరూ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. తర్వాత సుమారు 50 మందికి వైరస్‌ సోకినా ఎవరికీ ఏమీ కాలేదు. మధుమేహం, హైబీపీ రెండూ ఉన్నవాళ్లు కూడా కోలుకున్నారు. సీటీ స్కాన్‌లో కూడా ఇండెక్స్‌ తీవ్రత ఉన్నట్లుగా రాలేదు. దీనిని బట్టి వ్యాక్సిన్‌ వల్ల ప్రయోజనం ఉందని స్పష్టమవుతోంది. ఆసుపత్రిలో పని చేసే ఆరోగ్య సిబ్బందిలో ఒకరికి మాత్రమే తీవ్రత ఎక్కువై నిమ్స్‌కు పంపించాం. అయితే ఆయన వ్యాక్సిన్‌ తీసుకోలేదు.

ఐసీయూ అవసరమైన వారి సంఖ్య తగ్గాలంటే ఏం చేయాలి

క్షణాలు ఎక్కువగా ఉండే వారిలో ఒక శాతంమంది వెంటిలేటర్‌పైకి వెళ్తున్నారు. వారిని కాపాడడానికి ఎంతో కష్టపడాలి. కొన్ని సందర్భాల్లో ఫలితం ఉండదు. వారికి పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాం. స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఐదురోజులపాటు ఇంట్లో ఉండి వైద్యం తీసుకున్నా ఇంకా ఎక్కువైతే ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలి. అలాకాకుండా చివరివరకు ఇంట్లో ఉండి అప్పుడు ఆసుపత్రులకు రావడం వల్ల ఐసీయూ బెడ్లపైన ఒత్తిడి పెరుగుతుంది. వారిని కాపాడేందుకు వైద్యులు, ఇతర సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయాల్సి వస్తోంది.

ఐసీయూ, ఆక్సిజన్‌ అవసరమయ్యే వారి సంఖ్య పెరుగుతోంది కదా? మౌలిక వసతులు పెంచారా

తంలో 24 ఐసీయూ బెడ్స్‌ ఉండేవి. ప్రస్తుతం 124 ఉన్నాయి. ఇందులో 24 గంటలూ నిపుణులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆక్సిజన్‌ బెడ్లు 641 ఉన్నాయి. ఇతర వైద్య అవసరాలకు పోనూ 430 మంది కరోనా రోగులకు ఆక్సిజన్‌ అందుబాటులో ఉంది. ఏప్రిల్‌ 1 నుంచి సరాసరిన ఎప్పుడూ చూసినా 350 మంది రోగులకు ఆక్సిజన్‌ అందిస్తున్నాం. ఆక్సిజన్‌కు ఎలాంటి కొరతా లేదు.

కోలుకున్న వారితో వాట్సప్‌ గ్రూప్‌

కొవిడ్‌ నుంచి కోలుకొని తిరిగి వెళ్లేటప్పుడు వారిలో కనిపించే ఆనందం, వాళ్లు చూపే ఆప్యాయతతో మేము పడిన శ్రమనంతా మరిచిపోతాం. కొత్త ఉత్సాహం కలుగుతుంది. కోలుకున్న వారందరితో కలిసి వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేశాం. ఆసుపత్రిలో వైద్యులు, ఇతర సిబ్బంది పునర్జన్మ ఇచ్చారంటూ వారు చెబుతుంటారు.

కోలుకొన్న వారిని చూస్తే కొండంత ఆనందం

ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి

‘‘కొవిడ్‌ సోకిన వారిలో బతుకు భయం వెన్నాడుతుంది. తమ మళ్లీ ఇంటికి చేరుకుంటామో లేదోనన్న బెంగ వారిని ఒక్కచోట నిలవనీయదు. వారి దగ్గరకు చికిత్స కోసం వెళ్లిన సందర్భాల్లో.. ‘మమ్మల్ని బతికించండి సారూ..’ అని దయనీయంగా వేడుకుంటున్నప్పుడు.. తెలియకుండానే కళ్లలో నీరు తిరుగుతుంది. అటువంటి వారు కోలుకొని ఇంటికెళ్తున్నప్పుడు మేం పొందే తృప్తే వేరు’’ అని మనసులో భావాలను వ్యక్తపరిచారు వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కోమల్ల నాగార్జునరెడ్డి. ఇక్కడ మత్తు వైద్య విభాగాధిపతిగా కూడా సేవలందిస్తోన్న ఆయనతో ముఖాముఖి.

మీ ఆసుపత్రిలో ప్రస్తుతం కొవిడ్‌ సేవలు ఎలా ఉన్నాయి

నేను చదువుకున్నది వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలోనే. అంచెలంచెలుగా ఈ స్థాయికి చేరా. మాతృసంస్థ రుణం తీర్చుకుంటున్నానని భావిస్తున్నా. గతేడాది ఆగస్టు 5 నుంచి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నా. నాకు కొవిడ్‌ పాజిటివ్‌ రాలేదు కాని.. మా కుటుంబ సభ్యులందరూ ఆ మహమ్మారి బారినపడి చికిత్స పొందారు. ఆ ఒత్తిడిలోనూ విధులకు హాజరయ్యా. ఇక్కడ కొవిడ్‌ రోగుల కోసం 800 పడకలను సిద్ధం చేశాం. ప్రస్తుతం 440 మంది చికిత్స పొందుతున్నారు. 20 మంది వెంటిలేటర్‌పై ఉన్నారు. మిగిలిన వారు ఆక్సిజన్‌పై ఉన్నారు.

కొవిడ్‌ చికిత్సలో మీ అనుభవాలు ఏం చెబుతున్నాయి

నేను రోజూ రోగుల వద్దకు వెళ్లి వస్తుంటా. పీపీఈ కిట్‌లో ఉన్న నన్ను వారు గుర్తుపట్టరు. నేను ఎలా ఉంటానో వారికి తెలియదు. కేవలం గొంతు విని గుర్తుపడతారు. కోలుకొని వెళ్లిపోతున్నప్పుడు మాత్రం నా గదికి వచ్చి కనిపించి వెళ్తుంటారు. కొందరు మీరు దేవుడంటూ మొక్కుతుంటారు. కొందరు ఇంటికెళ్లాక కూడా ఫోన్లు చేస్తుంటారు. రోగులు కోలుకొని ఇంటికెళ్తున్నప్పుడు వారి కళ్లలో ఆనందం ఎనలేని తృప్తినిస్తుంటుంది. ఒక బాలింతకు కొవిడ్‌ సోకింది. రోజుల బాబును దూరంగా ఉంచాల్సి వచ్చింది. ఆమె రోజూ ఏడ్చేది. ఆమెకు మా వైద్యసిబ్బంది నిత్యం ధైర్యం చెప్పేవారు. బిడ్డను వారే కొంచెం దూరంగా ఉంచి పట్టుకుని తల్లి పాలను పట్టేవారు. ఆమె కోలుకున్న తర్వాత బాబుతో పాటు సంతోషంగా ఇంటికెళ్లింది. ఇటువంటి సంఘటనలెన్నో.

మీ మనసుకు కష్టం కలిగించిన సంఘటనలున్నాయా

ముఖ్యంగా రెండోదశలో వైరస్‌ ఉద్ధృతిని అంచనా వేయడం కష్టమవుతోంది. బాగా కోలుకుంటున్నారు అనుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. రాత్రి వెళ్లేటప్పుడు బాగానే ఉన్నాడని అనుకున్న రోగులు.. పొద్దున రౌండ్స్‌కొచ్చేసరికి చనిపోయారని తెలిస్తే చాలా బాధనిపిస్తుంది. డిశ్చార్జి అయి ఇంటికెళ్తూ గేటు దగ్గర హఠాత్తుగా మృతిచెందినవారూ ఉన్నారు.

రెండోదశ ప్రభావం ఎలా ఉంది

సారి చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తొలిదశలో వృద్ధులు ఎక్కువమంది చనిపోయేవారు. ప్రస్తుతం మృతుల్లో యువత సంఖ్య ఎక్కువ. ఆసుపత్రికి ఆలస్యంగా రావడం వల్ల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమై, మరణాల సంఖ్య పెరుగుతోంది. కొవిడ్‌ రోగులు శ్వాసకోశాలకు సంబంధించిన వ్యాయామాలు చేస్తుండాలి.

వైద్య సిబ్బంది కూడా కొవిడ్‌ బారినపడి ఉంటారు కదా

మొదటి దశలో 350 వైద్యసిబ్బంది కొవిడ్‌ బారినపడ్డారు. ఇద్దరు మృతిచెందారు. రెండోదశలో ఒకరు చనిపోయారు. ఇప్పటి వరకూ ఇంత ఉద్ధృతిలోనూ కేవలం 15 మంది సిబ్బందికే పాజిటివ్‌ వచ్చింది. వైద్యసిబ్బందిలో సుమారు 70 శాతం మందికి రెండు డోసుల టీకాలు పూర్తవడం, చికిత్స పట్ల అవగాహన పెరగడమే కారణం. మా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌ ప్రొఫెసర్‌ రెండోసారి ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యరు. అలా 15 మంది వైద్యసిబ్బంది రెండోసారి కూడా కొవిడ్‌ బారినపడ్డారు. అయినా మళ్లీ ప్రాణాలకు తెగించి అంకితభావంతో సేవలందిస్తున్నారు. ఒక గంట పీపీఈ కిట్‌ వేసుకుంటేనే శరీరమంతా చెమటతో తడిసి ముద్దయి పోతోంది. అలాంటిది 5-6 గంటల పాటు విధుల్లో ఉండడం సాధారణ విషయం కాదు. నిజంగా మా వైద్యసిబ్బంది సేవలు అభినందనీయం.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: ఆక్సిజన్​ సరఫరా లేక నష్టాల బాటలో పరిశ్రమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.