కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చీమలకుంటపల్లిలో దారుణ హత్య జరిగింది. భూ సమస్య కారణాలే హత్యకు దారితీసిందని స్థానికులు వెల్లడిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తలకు తీవ్రగాయలు కాగా.. మల్లేశం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ కరుణాకర్ రావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు