ETV Bharat / state

తెరాసను అడ్డుకున్న కాంగ్రెస్​, తెదేపా, వామపక్షాలు - భారత్​ బంద్​ తాజా వార్తలు

భారత్​ బంద్​ కరీంనగర్​లో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. బంద్​లో పాల్గొనేందుకు వచ్చిన తెరాస శ్రేణులను కాంగ్రెస్​, తెదేపా, వామపక్ష నాయకులు అడ్డుకున్నారు. సన్న రకం వడ్లకు మద్దతు ధర ప్రకటించిన తర్వాతే బంద్​లో పాల్గొనాలని డిమాండ్​ చేశారు.

tension situation in Karimnagar city
తెరాసను అడ్డుకున్న కాంగ్రెస్​, తెదేపా, వామపక్షాలు
author img

By

Published : Dec 8, 2020, 10:26 AM IST

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్​ బంద్​ కరీంనగర్​లో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. బంద్​లో భాగంగా కరీంనగర్ బస్టాండ్ ముందు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు. తెరాస కార్మిక విభాగం అక్కడికి చేరుకోగానే కాంగ్రెస్, సీపీఐ సీపీఎం, తెదేపా నాయకులు వారిని అడ్డుకున్నారు.

సన్నరకం వడ్లకు మద్దతు ధర ప్రకటించిన తర్వాతే భారత్ బంద్​లో పాల్గొనాలని తెరాస నాయకులను డిమాండ్​ చేశారు. వారి మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అక్కడికి చేరుకున్న పోలీసులు నాయకులను చెదరగొట్టారు.

తెరాసను అడ్డుకున్న కాంగ్రెస్​, తెదేపా, వామపక్షాలు

ఇదీ చదవండి: బంద్​కు ఆర్టీసీ మద్దతు... కదలని బస్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.