Corona in medical college: రాష్ట్రంలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లోని గురుకులాల విద్యార్థులకు, విదేశాల నుంచి వచ్చిన వారిలో పలువురికి కొవిడ్ నిర్ధరణ కావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో కరోనా మహమ్మారి పంజా విసిరింది.
మెడికల్ కళాశాలలో
కరీంనగర్ సమీపంలోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో 42 మంది వైద్య విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. ఇటీవల కళాశాలలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమం అనంతరం కొందరు మెడికోలకు కరోనా లక్షణాలు కనపడటంతో.. యాజమాన్యం పరీక్షలు నిర్వహించింది. వీరిలో ఏకంగా 42 మందికి పాజిటివ్ నిర్ధరణ కాగా.. మరికొంత మంది విద్యార్థులకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు రావాల్సి ఉంది.
నిర్లక్ష్యమే కారణమా..
వార్షికోత్సవం కార్యక్రమంలో అక్కడున్న ఎవరూ మాస్కులు ధరించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కరోనా విజృభించి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో కొవిడ్ కేసులు వెలుగు చూడటంతో యాజమాన్యం విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో పదుల సంఖ్యలో కరోనా కేసులు బయటపడటం కలకలం రేపుతోంది. పాజిటివ్ వచ్చిన వారిలో ఎవరికీ తీవ్ర లక్షణాలు లేవని యాజమాన్యం వెల్లడించింది.
ఇదీ చదవండి: DH Srinivasa Rao on Omicron: జనవరి 15 తర్వాత రాష్ట్రంలో కేసులు పెరిగే అవకాశం: డీహెచ్
Tags: corona cases in ts , omicron cases , corona in gurukuls , ts corona cases latest