కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తడిసిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని నాయకులు ఆరోపించారు. పోలీసులు ధర్నా వద్దకు చేరుకొని విరమింపచేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని పర్యవేక్షకుడికి వినతిపత్రాన్ని అందించారు.
ఇదీ చూడండి: దిశ కేసు: నిందితులు వాడిన లారీ దృశ్యాలు విడుదల