ETV Bharat / state

కరీంనగర్​లో కిటకిటలాడుతున్న ఈత కొలన్లు

చిన్నారులకు సెలవులు వచ్చేశాయ్​. ఇక వారి అల్లరికి అడ్డు ఉండదు. పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వారిని ప్రోత్సహిస్తే... ఈ సెలవులు సద్వినియోగం అవుతాయి. అందుకే కరీంనగర్​ చిన్నారులు వేసవిలో చల్లచల్లగా స్విమ్మింగ్​పూల్​లో ఈత నేర్చుకుంటున్నారు.

author img

By

Published : Apr 24, 2019, 9:38 PM IST

కరీంనగర్​లో కిటకిటలాడుతున్న ఈత కొలన్లు
కరీంనగర్​లో కిటకిటలాడుతున్న ఈత కొలన్లు

పిల్లలు ఈతకు వెళ్లి మృత్యవాత పడిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఈ వేసవిలో వారికి స్విమ్మింగ్​ నేర్పిస్తే ఉల్లాసం, ఉత్సాహంతో పాటు జ్ఞాపకశక్తి మెరగవుతుందని కొచ్​లు చెబుతున్నారు. ఈత నేర్చుకోవడం వల్ల తమ ప్రాణాలను రక్షించుకోవడమే కాకుండా ఇతరులను రక్షించడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.

అందుకే స్విమ్మింగ్​పూల్​లో ఈత నేర్చుకుంటే... సురక్షితమని సూచిస్తున్నారు. స్విమ్మింగ్​కు ముందు వ్యాయామం చేయడం వల్ల కండరాలలో ఒత్తిడి తగ్గి శరీర భాగాలు ఈతకు సహకరిస్తాయని చెబుతున్నారు. కరీంనగర్ పట్టణంలో మూడు స్విమ్మింగ్ పూల్​లు అందుబాటులో ఉండగా చిన్నారులతో ఈత కొలనులు కిటకిటలాడుతున్నాయి. స్వయంగా తల్లిదండ్రులు చిన్నారులకు ఈత నేర్పడానికి రంగంలోకి దిగుతున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.