విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఓ ప్రైవేట్ పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన గాలిపటాలు రంగోళి వేడుకలు చూపరులను అలరించాయి. విద్యార్థులు వివిధ రంగులతో వేసిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తమ పిల్లలు పోటీల్లో గెలిచేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు గాలిపటాలు తయారు చేసేందుకు పోటీ పడ్డారు. విద్యార్థులు వివిధ ఆకృతులలో గాలిపటాలను తయారుచేసి శభాష్ అనిపించుకున్నారు.
ఇదీ చూడండి : బీర్ కేక్ ఎప్పుడైనా తిన్నారా?