కరీంనగర్ పట్టణంలో న్యూ శర్మ నగర్ మహాత్మ జ్యోతిబాపులే బాలికల వసతి గృహంలో జన్ను అక్షయ మృతిపై జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ విచారణ చేపట్టారు. విధులపై నిర్లక్ష్యం చూపిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్, కేర్ టేకర్ లావణ్య సస్పెండ్‌కు... కలెక్టర్‌కు సిఫారసు చేశారు. ఎలాగైనా సరే తమ బిడ్డ ప్రాణం పోయేందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి తల్లిదండ్రులు కోరారు. జేసీ కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. పాప మృతితో భయపడిన తోటి విద్యార్థులను... వారి తల్లిదండ్రులు వచ్చి ఇంటికి తీసుకెళ్లిపోయారు.
ఇవీ చూడండి: దీపావళి కాంతుల్లో ఆసేతు హిమాచలం..