ETV Bharat / state

కరోనా వేళ 'ఆశా'దీపం.. వచ్చేది మాత్రం అరకొర జీతం

author img

By

Published : Jun 5, 2021, 3:23 PM IST

కరోనా వేళ గర్భిణీలకు, కొవిడ్ రోగులకు అండగా ఉంటూ... వారి ఆరోగ్యాన్ని అమ్మలా చూస్తున్నారు ఆశా కార్యకర్తలు. విధి నిర్వహణలో తలకు మించిన భారం, శ్రమ అధికమవుతున్నా, నిరుత్సాహం చెందక వారి సేవలను నిరంతరం ప్రజలకు అందిస్తున్నారు. ఒకవైపు గర్భిణీలకు సేవలు, మరోవైపు కరోనాతో నిత్య యుద్ధం చేస్తున్నారు. అయినప్పటికీ చాలీచాలని వేతనంతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఆశా కార్యకర్తల ప్రస్తుత పరిస్థితులపై కథనం...

Special story on asha worker's
Special story on asha worker's

నవమాసాలు మోసి జన్మనిచ్చేది అమ్మ. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మనిషి మరణించే వరకు సేవలు అందించేది "ఆశా". గర్భిణీలకు, బాలింతలకు, పసిపిల్లలకు, బాలలకు, పెద్దలకు, వృద్ధులకు అందరికీ దిక్కు "ఆశా కార్యకర్తలే ". తల్లిలా లాలిస్తూ, బుజ్జగిస్తూ, మాటలు పడుతూ, విధినిర్వహణలో తనకుతానే సాటి, తమలా సేవలు చేసేందుకు రారు ఎవరు పోటీ అంటూ ముందుకు వెళుతూ... చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్నారు "ఆశా" కార్యకర్తలు. (Asha workers)

కరోనా వేల రోగులకు వారే ఆశ..

ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తున్న కరోనా మహమ్మారి గ్రామీణ ప్రాంతాలకు పాకింది. కుటుంబాలకు కుటుంబాలే అంతరిస్తున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఎవరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా "ఆశా" ముందుండి సూచనలు, సలహాలు అందిస్తున్నారు. అనేక కుటుంబాల్లో కరోనా కరాళ నృత్యంతో బంధాలు తెగిపోతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనాకు ఎదురొడ్డి, రోగుల ఇళ్ళ వద్దకు నేరుగా వెళ్ళి వైద్యం చేస్తూ, వారిలో మనోధైర్యాన్ని నింపుతూ మీ ప్రాణాలకు మేమున్నామంటూ, కరోనా బాధితులకు అండగా ఉంటున్నారు.

తక్కువ వేతనంతోనే విధులు..

వైద్య ఆరోగ్య శాఖలో అతి తక్కువ వేతనంతో విధులు నిర్వహిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే వారు "ఆశా" కార్యకర్తలు మాత్రమే. ప్రతి "ఆశా" కార్యకర్త స్థానికంగా నివాసం ఉంటూ ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని ఉన్నతాధికారులకు తెలియజేస్తారు. "ఆశా" వర్కర్ల ముఖ్య విధి గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు, వృద్ధులకు మందులను, టీకాలను ,పౌష్టికాహారం ఇవ్వడం. ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేందుకు "ఆశా"లు ఎంతో దోహదపడుతున్నారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి అదనంగా కోవిడ్ విధులను కూడా నిర్వహిస్తున్నారు. ఇన్ని రకాలుగా సేవలందిస్తున్న వారికి ప్రభుత్వం నుంచి అరకొర వేతనాలు మాత్రమే అందుతున్నాయి. కరోనా విధుల్లో పాల్గొంటున్న ప్రత్యేక అలవెన్సులు రావడంలేదని వాపోతున్నారు.

ఫీవర్ సర్వేలో ప్రధాన పాత్ర..

కరోన వ్యాధి ఉద్ధృతి గురించి తెలుసుకోవాలని ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మే మొదటి వారం నుంచి గ్రామ గ్రామాన ఫీవర్ సర్వే ప్రారంభించారు. ఇందులో ఆశా, ఏఎన్ఎమ్​ల భాగస్వామ్యం ఎంతో విలువైనది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీరు ఇప్పటికే రెండు సర్వేలు పూర్తిచేసి.. మూడో సర్వే కూడా అక్కడక్కడా ప్రారంభించారు. ఈ సర్వే ద్వారా కుటుంబాల ఆరోగ్య పరిస్థితిని నిశితంగా తెలుసుకుని, కరోనా అనుమానితులను గుర్తించడం, పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం, ఐసోలేషన్ సెంటర్లకు తరలించడం, కిట్లు అందించడం వీరి బాధ్యత. ఒకవైపు మాతాశిశు సంరక్షణ కోసం ఎన్నో విధాలుగా కృషి చేస్తూ... ప్రభుత్వ ఆదేశానుసారం కోవిడ్ బాధితులకు రాత్రనకా, పగలనకా సహాయ సహకారాలు అందిస్తూ అమ్మలా వారిని చూసుకుంటున్నారు.

"ఒక్కొసారి కుటుంబాలను, పిల్లలను వదిలి సేవలు చేస్తుంటే కొంత మంది వల్ల మాటలు పడాల్సి వస్తుంది. ఒకానొక సందర్భంలో భోజనం కూడా సమయానికి చేయలేకపోతున్నాం. విధుల్లో భాగంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేవరకు ఇంట్లోని కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాసేలా మా కోసం ఎదురు చూస్తుంటారు".

- స్రవంతి. ఆశా వర్కర్

కరోనా రెండవ దశలో ఎనిమిది మంది ఏఎన్ఎమ్ నలుగురు ఆశా కార్యకర్తలకు కరోనా సోకింది. అయినా మొక్కవోని ధైర్యంతో సకాలంలో మందులు తీసుకొని, మరల ప్రజల సేవకు విధి నిర్వహణకు పూనుకున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంత కష్టమైనా మా బాధ్యతను మరువం, మా జీవితం ప్రజాసేవకే అంకితం అని తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం "ఆశా" ల పట్ల ప్రత్యేక దృష్టి సాధించి అలవెన్సులు అందజేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి. రోగి సహాయకులు.. రోగుల జేబులు ఖాళీ చేస్తారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.