ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక వైద్యసదుపాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చైనాతో గ్రానైట్ వ్యాపారం అధికంగా జరిగే కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్‌పై వైద్యశాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
వ్యాపార రీత్యా కరీంనగర్‌కు వచ్చే వారు... ఇక్కడి నుంచి చైనా, ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉంటే... తక్షణం వైద్యం అందించేందుకు జిల్లా ఆసుపత్రిలోనే ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. అక్కడి సదుపాయాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్‌తో మా ప్రతినిధి ముఖాముఖి...
ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్: మాస్క్‌లకు పెరిగిన డిమాండ్