ETV Bharat / state

Software Engineer: కొలువు వదిలేసి.. పొలం బాటపట్టి! - karimnagar district latest news

వ్యవసాయం వృత్తి కాదు, జీవన విధానం అని చెబుతారు. కానీ మల్లికార్జున్‌రెడ్డికి మాత్రం అదే జీవితం. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసిన అతడు.. తర్వాత ఉద్యోగం మానేసి సాగుబాట పట్టాడు. వినూత్న ప్రయోగాలతో విజయవంతమైన రైతుగా మరెందరో అన్నదాతలకు మార్గదర్శిగా నిలుస్తున్నాడు.

కొలువు వదిలేసి.. పొలం బాటపట్టి!
కొలువు వదిలేసి.. పొలం బాటపట్టి!
author img

By

Published : Jun 6, 2021, 11:06 AM IST

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లిలోని మల్లికార్జున్‌రెడ్డి పొలానికి వెళ్తే ఓ చిన్న వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వెళ్లినట్టే. ఎందుకంటే సాగులో నిత్యం ప్రయోగాలు చేస్తాడు. 18 ఎకరాల్లో అతడు చేస్తున్నది సమీకృత వ్యవసాయం. పొలంలో ఓవైపు పచ్చని పంటలు మరోవైపు ఆవులూ, మేకలూ, గొర్రెలూ, కోళ్లూ కనిపిస్తాయి. సాగు బావుల్లో చేపల పెంపకమూ చేస్తాడు. ఇవి అతడికి ఏడాది పొడుగునా ఆదాయాన్ని ఇస్తాయి. పంట వ్యర్థాలు పశువులకు మేతగా మారితే, ఆవుపేడ జీవామృతంగా మారి పంటకు సారాన్నిస్తుంది. పొలం పనుల్లో మల్లికార్జున్‌కు భార్య సంధ్య, తల్లిదండ్రులు మణెమ్మ-లక్ష్మారెడ్డిల నుంచి తోడ్పాటు ఉంటుంది.

.

రసాయనాలు వద్దనుకుని...
ఏడేళ్ల కిందట మల్లికార్జున్‌ దంపతులు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేసేవారు. ఆ సమయంలో తమ బంధువుల్లో కొందరు హాస్పిటల్‌ పనులమీద హైదరాబాద్‌ వస్తుండేవారు. కల్తీ ఆహారమే వారి అనారోగ్యానికి కారణమని తెలుసుకున్నాడు మల్లికార్జున్‌. అదే సమయంలో తన స్నేహితుడి కూతురు క్యాన్సర్‌తో చనిపోయింది. కల్తీ ఆహారం, కాలుష్యం అభంశుభం తెలియని పిల్లల్ని సైతం బలిగొంటున్న విషయం అతణ్ని ఆలోచనల్లో పడేసింది. స్వచ్ఛమైన పల్లె జీవనమే దీనికి పరిష్కారం అనుకున్నాడు. తన పొలంలో సేంద్రియ సాగు చేయాలనుకున్నాడు. అతడి ఆలోచనకు కుటుంబ సభ్యుల మద్దతు దొరికింది. దాంతో 2014లో తమకు చెందిన 14 ఎకరాల్లో పంట సాగు బాధ్యతను తీసుకున్నాడు. పాలేకర్‌, రాజీవ్‌ దీక్షిత్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు... ఇలా పలువురిని కలిసి సేంద్రియ సాగు, సమీకృత వ్యవసాయం గురించి తెలుసుకున్నాడు. సిస్టమ్‌ ఆఫ్‌ రైస్‌ ఇంటెన్సిఫికేషన్‌(శ్రీ) పద్ధతిలో వరి సాగు చేస్తాడు. వెదజల్లడం, డ్రమ్‌ సీడర్‌... తదితర పద్ధతుల్లో విత్తనాలు జల్లుతాడు. దీనివల్ల తక్కువ మొత్తంలో విత్తనాలు అవసరమవుతున్నాయని చెబుతాడు. మొత్తంగా ఎకరాకు రూ.25వేలు ఖర్చు చేసి రూ.1.13 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాడు. మల్లికార్జున్‌ సాగు విధానాలకు గుర్తింపుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐసీఏఆర్‌) అందించే ‘జగ్జీవన్‌రామ్‌ అభినవ్‌ కిసాన్‌’ అవార్డు అందుకున్నాడు. తన పొలానికి అదనంగా మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని దేశీ వరి వంగడాలైన నవారా, నారాయణకామిని, కాలాబట్టి, జింక్‌100, బ్రహ్మీ, రత్నచోడి, బ్లాక్‌, రెడ్‌రైస్‌, జేజీఎల్‌ 24423 లాంటి పలు రకాల పంటలను సాగు చేస్తున్నాడు. రైతులకు విత్తనాల్నీ అందిస్తాడు.

.

అడ్డబోర్లతో జల విజయం...
ఆహారపదార్థాల్లో ఒక్కటి కూడా బయట కొనకుండా అల్లం, వెల్లుల్లి, పసుపు, మిర్చి, గోధుమలు, సెనగలు, కందులు, పెసలు, చెరకు, నువ్వులు, వేరుసెనగ, పొద్దు తిరుగుడుతోపాటు పలు రకాల కూరగాయలూ, పండ్లూ తన చేలో పండించుకుంటున్నాడు. సాగు నీటికి కొరతలేకుండా పొలంలోని నేలబావిలో 30 అడుగుల లోతున భూమికి సమాంతరంగా 12 అడ్డబోర్లను తవ్వించాడు. ఇలా చేయడంవల్ల వర్షం నీరు బావిలోకి చేరి నీటి కొరత ఉండటం లేదంటాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రభుత్వమూ, ప్రైవేటు సంస్థలూ ఏర్పాటుచేసే సదస్సుల్లో పాల్గొని తన సాగు విధానాల గురించి చెబుతాడు. చుట్టుపక్కల గ్రామాల్లోని యువ రైతులు మల్లికార్జున్‌ను ఆదర్శంగా తీసుకుని తమ సాగు విధానంలో మార్పులు చేస్తున్నారు.

.

ఇదీ చూడండి: చాయ్‌ బిస్కెట్‌... ఇద్దరు స్నేహితుల కథ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.