కరీంనగర్ జిల్లా వీణవంక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందించే సేవలు బాగున్నాయా లేవా అని చూసేందుకేమో అనుకోని అతిథి వచ్చాడు.
ఆస్పత్రికి సిబ్బంది రోగులకు చికిత్స అందిస్తున్న తరుణంలో ఓ నాగుపాము వచ్చింది. గమనించిన సిబ్బంది, రోగులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
గ్రామానికి చెందిన వీరేశం పామును కర్ర సాయంతో బయటకు పంపించాడు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న చెట్ల పొదల నుంచే పాము వచ్చినట్లు సిబ్బంది భావిస్తున్నారు.
- ఇదీ చూడండి : దిశ హత్యకేసులో నలుగురు నిందితుల ఎన్కౌంటర్