కరీంనగర్లోని బృందావన్ కాలనీలో ద్విచక్రవాహనంలోకి పాము చొరబడింది. ఓ ఇంటి ముందు నిలిపిన బైకులోకి పాము దూరడాన్ని గమనించిన స్థానికులు... జీవాలను రక్షించే సంస్థకు సమాచారం అందించారు.
సంస్థ నిర్మాహకులు సుమన్ అక్కడికి చేరుకొని వాహనంలో నుంచి పామును సురక్షితంగా బయటకు తీసి... నీటిలో వదిలిపెట్టారు. వర్షాకాలంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: పాముకాటుకు గురై ఒక్కగానొక్క కూతురు మృతి...