సింగరేణిలో మూడో రోజు సమ్మె కొనసాగుతోంది. కొంతమంది కార్మికులు బందోబస్తు మధ్య విధులకు హాజరవుతున్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూ ఇంక్లెయిన్ బొగ్గుగని వద్ద కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అత్యవసర సిబ్బంది తప్ప... మిగతావారు అందరూ సమ్మెలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో కుమ్మక్తై.. నాటకమడుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు.
మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఉపరితల గనుల్లో పని చేసే 6 వేల మందిలో అత్సవసర సిబ్బంది మినహా మిగిలిన వారందరూ విధులకు గైర్హాజరయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కార్మికులు పాక్షికంగా విధులకు హాజరయ్యారు. కోయగూడెం ఉపరితల బొగ్గు గనులకు వెళ్తున్న కార్మికులను విధులకు వెళ్లవద్దని జేఏసీ నాయకులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
మరోవైపు కొత్తగూడెం జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని జాతీయ కార్మిక సంఘాల నాయకులు దిగ్భందించారు. గనుల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి:'చైనా, పాక్ విద్యుత్తు పరికరాలు దిగుమతి చేసుకోం'