రాష్ట్రం, కేంద్రంలో ఒకే పార్టీ ఉంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని గత అయిదేళ్లు ప్రజలు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. స్థానికేతరుడైన ఎంపీ వినోద్ కరీంనగర్‌కు చేసిందేమీలేదన్నారు. ఎవరెన్ని చెప్పినా ఎమ్మెల్సీ ఫలితాలే పార్లమెంటు ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోసారి తనకు అవకాశమిస్తే విద్య, వైద్యం, వ్యవసాయం,ఉపాధి, పర్యాటకం లాంటి రంగాల్లో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానాని పొన్నం ప్రభాకర్ పంచరత్నాల్లాంటి హామీలు ఇచ్చారు.
ఇవీ చూడండి:ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు