ETV Bharat / state

SARPANCH RESIGN: సాంబయ్యపల్లి సర్పంచ్​ రాజీనామా.. ఎందుకో తెలుసా..!

కరీంనగర్ జిల్లా సాంబయ్యపల్లి సర్పంచ్ తన పదవికి రాజీనామా చేశారు. గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన తాను.. మహిళా వార్డు సభ్యుల భర్తలు అభివృద్ధి పనుల్లో అడ్డుపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని సర్పంచ్​ రాజీనామా

author img

By

Published : Aug 15, 2021, 7:00 PM IST

Updated : Aug 15, 2021, 7:27 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం సాంబయ్యపల్లి సర్పంచ్ కొత్తపెల్లి రామకృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. విశ్రాంత ప్రొఫెసర్ అయిన కొత్తపెల్లి రామకృష్ణ.. తన గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. కానీ మహిళా వార్డు సభ్యుల భర్తలు అభివృద్ధి పనుల్లో అడ్డు పడుతుండటంతో మనస్తాపానికి గురైనట్లు వెల్లడించారు.

ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. అంతటితో ఆగకుండా అభివృద్ధి పనులకు సంబంధించి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ పదవికి రాజీనామా చేయటంతోనైనా గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని వివరించారు.

గ్రామ పంచాయతీ మీటింగులు, గ్రామంలో ఏ అభివృద్ధి పనులు జరిగినా మహిళా వార్డు సభ్యుల భర్తలు హాజరై.. ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉప సర్పంచ్​ భర్త చెక్కులపై సంతకాలు పెట్టకుండా వేధిస్తున్నాడు. ఏ అభివృద్ధి పనులకూ సహకరించడం లేదు. గ్రామంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టినా వార్డుసభ్యులు హాజరుకావడం లేదు. -రామకృష్ణ, సర్పంచ్

SARPANCH RESIGN: సాంబయ్యపల్లి సర్పంచ్​ రాజీనామా.. ఎందుకో తెలుసా..!

ఇదీ చూడండి: High court CJ: తెలంగాణలో 33 జ్యుడీషియల్​ జిల్లాల ఏర్పాటును పరిశీలిస్తున్నాం

Last Updated : Aug 15, 2021, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.