టీఎస్ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. కరీంనగర్లో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. 100 మంది సిబ్బంది రక్తదానం చేశారు. గత 35 సంవత్సరాలుగా ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్సు నడిపిన 30 మంది డ్రైవర్లను ఘనంగా సన్మానించారు. అనుకోకుండా జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారికి సమయానికి రక్తం అందేలా ఈ కార్యక్రమం నిర్వహించామని రీజినల్ ఆర్ఎం జీవన్ ప్రసాద్ తెలిపారు.
- ఇదీ చూడండి : కపిల్ బృందంపై ఫిర్యాదు- కోచ్ ఎంపిక ఎలా?