ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హుజూరాబాద్ డ్రామా మొదలైందని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. హుజూరాబాద్ డ్రామాలో భాజపా కూడా అద్భుతంగా నటిస్తోందని విమర్శించారు. తెరాస, భాజపా మధ్య లోపాయకారి ఒప్పందం ఉందన్నారు. హుజూరాబాద్‌లో ఎవరు గెలిచినా ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన అన్నారు. సీఎం రేపే అసెంబ్లీ రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పేర్కొన్నారు. కరీంనగర్‌లో బీఎస్పీ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముదిరాజ్ బిడ్డను ఓడించి ఎవరికి పాఠం నేర్పాలనుకుంటున్నారని... ఈటలకు గుణపాఠం చెప్పేందుకు వందలకోట్లు ఖర్చు చేస్తారా అంటూ ప్రశ్నించారు.
బూతులు మాట్లాడేవాళ్లకు వర్సిటీలు ఇస్తున్నారు ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు దోపిడీకి గురయ్యాయని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బహుజన రాజ్యం వస్తే కాళేశ్వరం కాదు.. జ్ఞానేశ్వరాన్ని తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఆ రాజ్యంలో బడుగులే పాలకులుగా ఉంటారన్నారు. నిరుద్యోగులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. ఎన్నికలు వస్తేనే నోటిఫికేషన్లు వస్తాయా అంటూ ప్రశ్నించారు. జోన్ నిబంధనల అమలుకు మూడేళ్లు పడుతుందా అంటూ మండిపడ్డారు.
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హుజూరాబాద్ డ్రామా మొదలైంది.హుజూరాబాద్ డ్రామాలో భాజపా కూడా అద్భుతంగా నటిస్తోంది. తెరాస, భాజపా మధ్య లోపాయకారి ఒప్పందం ఉంది. బహుజన రాజ్యంలో బడుగులే పాలకులు. నిరుద్యోగులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు. ఎన్నికలు వస్తేనే నోటిఫికేషన్లు వస్తాయా?. జోన్ నిబంధనల అమలుకు మూడేళ్లు పడుతుందా? -ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఎస్పీ నేత
ఇదీ చదవండి: dalit bandhu: రేపు కరీంనగర్‌కు సీఎం.. దళితబంధుపై సమీక్ష