కరీంనగర్ జిల్లా చొప్పదండి, రుక్మాపుర్ వరి కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి ధాన్యం తడిసి పోయింది. చొప్పదండి శివారు శివకేశవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొంత ధాన్యం కొట్టుకుపోయింది. తూకం వేయటంలో జాప్యం కారణంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందారు. రుక్మాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వందల సంఖ్యలో బస్తాలు తడిసి పోయాయి.
ఇదీ చూడండి: 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'