Kaleshwaram 3rd TMC Works: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. కురిక్యాల రహదారిపై రైతులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ కాల్వ కోసం భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు, గ్రామస్థుల ఆందోళన సమాచారంతో పోలీసులు సైతం భారీగా మోహరించారు. ఆందోళనకు మద్దతు పలికిన టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, ఇతర కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
![Kaleshwaram 3rd TMC Work](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14296022_kaleswaram1.png)
"మాది విలాస్సాగర్ గ్రామం. రాజన్న సిరిసిల్ల. గతంలో కొంత భూమి తీసుకున్నారు. ఇప్పుడు ఇంకొంత భూమి తీసుకుంటామని చెబుతున్నారు. భూమంతా తీసుకున్నాక మేం ఎలా బతకాలి. మా పిల్లలను ఎవరు పెళ్లి చేసుకుంటారు. మా సమస్యపై నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తున్నారు."
- లక్ష్మి, మహిళారైతు, విలాస్ సాగర్
"నిరసన తెలిపే అవకాశం ఇవ్వడంలేదు. రోడ్డుపైకి వస్తేనే అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికి మూడుసార్లు భూములు కోల్పోయాం. ఇప్పుడు నాలుగోసారి భూములు అడుగుతున్నారు.. సెంటు భూమి కూడా ఇచ్చేందుకు సిద్ధంగాలేము. మమ్మల్ని చంపి భూములు లాక్కోండి."
- సురేందర్, తాడిజెర్రి రైతు
ఇదీచూడండి: