ETV Bharat / state

నడిచి వెళ్తున్న వలసకూలీలకు ఆశ్రయమిచ్చిన పోలీసులు

ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన వలస కూలీలకు కొత్తపల్లి పోలీసులు ఆశ్రయం కల్పించారు. రాత్రి బస, భోజన వసతి కల్పించి ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

author img

By

Published : May 18, 2020, 11:10 AM IST

police-sheltering-migrants-at-karimnagar
నడిచి వెళ్తున్న వలసకూలీలకు ఆశ్రయమిచ్చిన పోలీసులు

లాక్‌డౌన్‌ కారణంగా స్వస్థలాలకు వెళ్లేందుకు నడిచి వెళ్తున్న వలస కూలీలకు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీసులు ఆశ్రయం కల్పించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న సుమారు 80మంది ఒడిశా కూలీలు...రాత్రి బైపాస్ దారిలో వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. కరీంనగర్‌ సీపీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు వీరందరికి చింతకుంటలో ఆశ్రయం కల్పించి భోజనం అందించారు. ఇటుక బట్టీల యజమానులతో చర్చించి ప్రత్యేక వాహనాల్లో కూలీలను వారి స్వగ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి: ప్రాజెక్టుల పరిధిలోని చెరువులన్నింటినీ నింపాలి: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.