ETV Bharat / technology

కోకాకోలా క్రిస్మస్ యాడ్ వచ్చేసింది- అయితే ఈసారి సీన్ రివర్స్! - COCA COLA AD FOR CHRISTMAS

కోకాకోలా క్రిస్మస్ యాడ్​పై విమర్శల వెల్లువ- కారణం ఏంటో తెలుసా?

Coca-Cola AI Generated Ad
Coca-Cola AI Generated Ad (Coca-Cola)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 18, 2024, 7:17 PM IST

Updated : Nov 18, 2024, 7:27 PM IST

Coca Cola AD for Christmas: త్వరలో క్రిస్మస్ పండగ రాబోతుంది. ఇండియాలో క్రిస్టియన్స్ తక్కువగా ఉన్నప్పటికీ అమెరికా వంటి దేశాల్లో ఈ ఫెస్టివల్​ను చాలా వైభవంగా జరుపుకొంటారు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే కోకా-కోలా ఈసారి కూడా తన క్రిస్మస్ యాడ్​ను రిలీజ్ చేసింది. అయితే హాలిడేస్ ఎక్సైట్మెంట్​తో ఆన్​లైన్​లో రిలీజ్​ అయిన ఈ యాడ్​పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే?

సమాచారం ప్రకారం.. 15-సెకన్ల ఈ యాడ్​ 1995 ఐకానిక్ 'హాలిడేస్ ఆర్ కమింగ్' ప్రచారాన్ని రీక్రియేట్ చేసింది. ఈ యాడ్​లో.. ఫెస్టివ్ హాలీడేస్ సమయంలో మంచు సోయగాలతో నిండి ఉన్న నగరానికి సోడా డెలివరీ చేసే కోకా-కోలా ట్రక్కుల కాన్వాయ్ వెళ్లడం కన్పిస్తుంది. అయితే ఈ యాడ్ వీక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణం కంపెనీ ఏఐతో దీన్ని క్రియేట్ చేయడమే.

కోకా-కోలా ఈ ప్రకటన కంపెనీ 'Real Magic AI' సాఫ్ట్​వేర్​ను ఉపయోగించి క్రియేట్ చేసినట్లు తెలిపింది. ఈ యాడ్​లోని క్యారెక్టర్స్, ఫెస్టివ్ సీన్స్​ అన్నీ ఏఐ జనరేటెడ్ విజువల్స్ అని పేర్కొంది. ఈ గ్లోబల్ పానీయాల దిగ్గజం యాడ్​ తన ట్రెడిషనల్ బ్రాండ్ హెరిటేజ్ ఫ్యూచర్ టెక్నాలజీతో కంబైన్ చేస్తుందని పేర్కొంది.

అయితే ఈ వారంలో ప్రసారం మొదలైన ఈ యాడ్​ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియా యూజర్స్ దీన్ని "creepy", "depressing", "soulless" గా అభివర్ణిస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యమైన క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో క్రియేట్ చేసిన ఈ ప్రకటనలో మానవ కళాత్మకత లేకపోవడంపై ప్రశ్నిస్తున్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన ఈ ప్రకటన హ్యూమన్ ఎమోషన్స్​ను క్యారీ చేయలేకపోయిందంటూ విమర్శిస్తున్నారు.

'ఎక్స్​'లో ఈ యాడ్​ చూసిన ఓ వీక్షకుడు 'క్రిస్మస్ కోకాకోలా యాడ్​ను ఏఐతో రూపొందిస్తే ప్రపంచ అంతం అయిపోతుందని అన్నారు. దీనిపై మరో యూట్యూబ్ యూజర్​.. 'ఏఐతో యాడ్​ను క్రియేట్ చేయడం చాలా బాధను కలిగిస్తుంది' అని కామెంట్ చేశారు. మరో ఎక్స్​ వైరల్ పోస్ట్​లో 'ఏఐ రూపొందించిన కోకా-కోలా యాడ్​ని నేను ఇప్పుడే చూశాను. సీరియస్​గా దీన్ని మనం ఎలా అనుమతిస్తాం?' అని అన్నారు. ఇదిలా ఉండగా కోకాకోలా తన నిర్ణయాన్ని భవిష్యత్తుకు ఒక అడుగుగా అభివర్ణించింది.

మస్క్‌కు బిగ్‌షాక్‌- 'ఎక్స్​'ను వీడి 'బ్లూ స్కై'లోకి యూజర్స్- కారణం ఇదే!

రిస్ట్ వాచ్ కాదు.. రింగ్ వాచ్.. ఇది పెట్టుకుంటే మీరే సూపర్ స్మార్ట్​!

Last Updated : Nov 18, 2024, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.