ఇక్కడ చూస్తున్నది మరబొమ్మ అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే.. కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన వారి రక్షణ కోసమే పోలీస్ శాఖ వారు ఈ పోలీస్ రోబోట్‌ను ఏర్పాటు చేశారు.
మరబొమ్మే కదా! మనల్ని ఏం చేస్తది అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే... ఇక్కడే అసలు మతలబుంది. ఈ రోబోట్ కళ్లల్లో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి... వేరే చోట నుంచి పోలీసులు దీనిని పర్యవేక్షిస్తుంటారు.
హైదరాబాద్-వరంగల్ రహదారికి ఆనుకుని ఉన్న ఈ కట్టడాన్ని తిలకించేందుకు రోజూ వందలాది మంది పర్యటకులు వస్తుంటారు. వేములవాడ, కొండగట్టు ఆలయాలను దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో ఇక్కడకు వస్తారు. వారి రక్షణ కోసమే రోబోట్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్‌నగర్ కార్పొరేషన్