ETV Bharat / state

ఎనిమిదేళ్లైనా పైసా ఇయ్యలే... ఆదుకోండి సార్లూ!

ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే... రైతుబీమా ద్వారా ప్రభుత్వం వెంటనే డబ్బులు అందిస్తోంది. మరణ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే చెక్కు రూపంలో ఐదు లక్షల ఇస్తున్నారు. అయితే... భూమిలేని రైతు కుటుంబాలు మాత్రం ఎనిమిదేళ్లుగా పరిహారం కోసం కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. రేపు మాపు అంటూ తిప్పుకుంటున్నారు తప్పితే... ఫలితం ఉండట్లేదని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రైతులు వాపోతున్నారు.

farmers
farmers
author img

By

Published : Mar 22, 2022, 4:09 PM IST

ఎనిమిదేళ్లైనా పైసా ఇయ్యలే... ఆదుకోండి సార్లూ!

వాళ్లంతా రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు. వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకీడిస్తున్న జీవితాలు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సాగు చేస్తే... పురుగు పోటు, వాతావరణ మార్పులు, ధరలు లేకపోవడం లాంటి సమస్యల్లాంటివి వారిని తీవ్రంగా నష్టపరిచాయి. అప్పులు మీద పడుతుంటే తట్టుకోలేక పురుగుల మందు తాగో లేదా ఉరివేసుకునో తనువు చాలించారు. ఏ ఆధారం లేని కుటుంబాలకు కావడంతో... ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ సంవత్సరాల తరబడి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేదు.

ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు..

జిల్లాల విభజన కాకముందు రైతులు చనిపోతే ఇప్పటికీ వారికి పరిహారం అందలేదు. తమ గోడు విని ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నా... పట్టించుకోవట్లేదని జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన రైతులు వాపోతున్నారు. వారం వారం నిర్వహించే ప్రజావాణిలో తమ సమస్యలను వెల్లబుచ్చుకున్నా... పట్టించుకున్న వారు లేరని కన్నీటి పర్యంతమవుతున్నారు.

తిరిగి తిరిగి అలసిపోయి...

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకంలో... ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు వెంటనే డబ్బులు ఇస్తున్నారు. కానీ వీరికి మాత్రం పైసా సాయం అందట్లేదు. ఇప్పటికే కలెక్టరేట్ల ముందు నిరసనలు ఆందోళనలు చేపట్టామని... అయినా తమ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 600కు పైగా బాధితులు ఉన్నారని చెబుతున్నారు. పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయామని... ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : కేసీఆర్‌ ప్రభుత్వ అక్రమాలకు కేంద్రం సహకరిస్తోంది: రేవంత్‌ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.