ETV Bharat / state

Huzurabad By Election: కాంగ్రెస్​ స్టార్ క్యాంపెయినర్లు ఎక్కడ? రేవంత్​రెడ్డి ఏం చేయబోతున్నారు?

హుజురాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఏంటి..? ఇతర పార్టీలతో పోటీ పడి కాంగ్రెస్‌ ఎందుకు ప్రచారం చేయడం లేదు...? (congress prepare campaign team) నామినేష‌న్ల ప్రక్రియ ముగిసి వారం దాటినా... ముఖ్య నేత‌లెవ‌రూ అటువైపు ఎందుకు క‌న్నెత్తి చూడ‌టం లేదు...? స్టార్ క్యాంపెన‌ర్లను నియమించినా ప్రచారానికి ఎందుకు పోవడం లేదు. పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్న ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం లేకపోవడంతో స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. స్టార్ క్యాంపెయినర్లతో నిమిత్తం లేకుండా 60 మందితో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి జూమ్‌ యాప్‌ ద్వారా రేవంత్‌ దిశానిర్దేశం చేయడంపై ప్రత్యేక కథనం.

Huzurabad By Election
Huzurabad By Election
author img

By

Published : Oct 18, 2021, 5:18 AM IST

Updated : Oct 18, 2021, 7:02 AM IST

కేసీఆర్ కేబినేట్‌ నుంచి బయటకొచ్చిన ఈట‌ల రాజేంద‌ర్... మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాతో అనివార్యమైన హుజూరాబాద్‌ ఉప ఎన్నిలను (huzurabad by poll) కాంగ్రెస్‌ పార్టీ పట్టించుకోవడం లేదన్న వాదన పార్టీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది (congress prepare campaign team). అభ్యర్థి ప్రకటన దగ్గర నుంచి ప్రచారం వరకు ఎందులోనూ సీనియర్ నాయకులు ఆశించిన స్థాయిలో చొరవ చూపడం లేదు. నామినేషన్‌ వేసే సమయంలో కొందరు సీనియర్లు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అయితే ఈ ఉప ఎన్నికను తెరాస, భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అదే రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే అభ్యర్థి ఎంపిక నుంచి మీనమేషాలు లెక్కించిన కాంగ్రెస్‌ పార్టీ చివరకు ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బ‌ల్మూరి వెంక‌ట్‌ను బరిలో దింపింది.

గ్రూపు రాజకీయాలతో లోపించిన ఐకమత్యం

కాంగ్రెస్‌లో స్వేచ్ఛ అధికం కావడంతో గ్రూపు రాజ‌కీయాలు సర్వసాధారణం. ప్రస్తుతం పీసీసీ నూతన చీఫ్ రేవంత్ రెడ్డి (tpcc president revanth reddy) వ‌చ్చాక‌... ఆయ‌న అనుకూల వ‌ర్గం, వ్యతిరేక వ‌ర్గాలు రెండు గ్రూపులుగా నాయకులు విడిపోయారు. పైకి నాయకులు అంతా కలిసిమెలిసి క‌నిపించినా.. లోలోన మాత్రం రాజ‌కీయం ర‌స‌వ‌త్తరంగా ఉంటుంది. ఈ ప్రభావం హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంపై కూడా ప‌డుతోంది. పార్టీలో ముఖ్య నేత‌లెవ‌రూ కూడా హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడ‌టం లేదు (congress prepare campaign team).

కన్నెత్తి చూడని స్టార్​ క్యాంపెయినర్లు

స్టార్ క్యాంపెయినర్లుగా 20 మందితో కూడిన జాబితాను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది (congress prepare campaign team). పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రచార క‌మిటీ ఛైర్మన్ మ‌ధుయాష్కి గౌడ్‌, సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మ‌రో ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు పార్టీ బాధ్యత‌లు అప్పగించింది. అయితే వీరిలో ఒక్కరు కూడా ఇప్పటి వ‌ర‌కు హుజురాబాద్ గ‌డ్డపై అడుగు పెట్టలేదు. పీసీసీ చీఫ్ రేవంత్‌, ప్రచార క‌మిటీ ఛైర్మన్ మ‌ధుయాష్కి మాత్రం నామినేష‌న్ సమయంలో హుజురాబాద్ వెళ్లి వ‌చ్చారు.

రంగంలోకి దిగిన రేవంత్​

నామినేష‌న్లు ప్రక్రియ పూర్తయి వారం రోజులు గ‌డిచినా.. కాంగ్రెస్ ప్రచార విషయమై ఉలుకూపలుకు లేదు. ప్రచారం నిర్వహించేందుకు నాయకులెవరు చొరవ చూపకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ నామ‌మాత్రపు పోటీలా మారేట్లు క‌నిపిస్తోంది. దీంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు (congress prepare campaign team).

ప్రత్యేక బృందం ఏర్పాటు

స్టార్ క్యాంపెయినర్లు, సీనియ‌ర్ల‌ను అటుంచి ప్రత్యేకంగా 60 మందితో కూడిన ఒక బృందాన్ని (special team) రంగంలోకి దించారు. నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రామాల‌ బాధ్యత‌ల‌ను వీరికి అప్పగించారు. శనివారం జరిగిన జూమ్ సమావేశంలో ఆ బృందంలోని సభ్యులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదల, నిరుద్యోగ, విద్యార్థుల సమస్యలను జనంలోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని రేవంత్ స్పష్టం చేశారు.

సమయం ఎంతో లేదు..

ఉప ఎన్నిక‌ల ప్రచార గ‌డువు (election campaign) మ‌రో 11 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం చేస్తే కనీసం డిపాజిటైనా దక్కుతుందని కొందరు .. సీనియ‌ర్లు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: CM KCR: ఈనెల 25 తర్వాత హుజూరాబాద్‌లో కేసీఆర్‌ సభ

Last Updated : Oct 18, 2021, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.