రాజకీయ లబ్ధికోసం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుటుంబాన్ని వాడుకోవద్దని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసీఆర్‌కు నిజంగా పీవీ పైన ప్రేమ ఉంటే వాణీదేవిని రాజ్యసభ సీటుగాని, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగాగాని అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పీవీని గౌరవిస్తూ అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించటంలో అర్థం లేదన్నారు. గెలవలేని, బలంలేని ఎమ్మెల్సీ స్థానంలో వాణీదేవికి అవకాశం ఇచ్చి... ఆ కుటుంబాన్ని అవమానపరిచే ప్రయత్నం చేయవద్దని పొన్నం తెరాసకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే పీవీకి సరైన గౌరవం'