గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ కలెక్టర్ శశాంక నివాసంలో తేనీటి విందును ఏర్పాటు చేశారు. విందు కార్యక్రమానికి బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి చర్చించారు.
అంతకుముందు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శశాంక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ కమిషనర్ వీవీ కమలాసన్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ క్రాంతి, మేయర్ సునీల్ రావు వేడుకల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గణతంత్ర దినోత్సవం వేళ బాలసదన్‌లో కలెక్టర్ శశాంక