ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురి కాకుండా పార్కులు నిర్మించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లో అభివృద్ధి చేసిన రెండు పార్కులను ఆయన ప్రారంభించారు. పార్కుల స్థలాలు అక్రమణలకు గురికాకుండా సరిహద్దు గోడలు నిర్మిస్తామన్నారు.
స్మార్ట్‌సిటీ పనుల్లో భాగంగా కాలనీల్లో ప్రజలకు చిన్నచిన్న పార్కులు అందుబాటులోకి తెస్తామన్నారు. గతంలో ప్రభుత్వ స్థలాలు ఎక్కువగా కబ్జాకు గురయ్యేవని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంగుల వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్‌రావు, కమిషనర్ క్రాంతి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం: గంగుల