ఉమ్మడి కరీంనగర్ జిల్లా విపణిని(Paddy procurement in Karimnagar) వరి ధాన్యం ముంచెత్తనుంది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో వరికోతలు ప్రారంభమయ్యాయి. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఆరబెడుతున్నారు. దసరా పండుగ ముగియడంతో వరి కోతలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ధాన్యం సేకరణ యంత్రాంగానికి సవాలుగా మారనుంది. యాసంగి సీజన్(Paddy procurement in Karimnagar) కు సంబంధించిన సీఎంఆర్‌కు ఇచ్చిన యాసంగి ధాన్యం మిల్లులు.. గోదాముల్లో గుట్టలుగా పేరుకున్నాయి. 70 శాతానికి పైగా ధాన్యం మిల్లుల్లోనే ఉంది. ఈ వానాకాలం కూడా రికార్డు స్థాయిలో వరి దిగుబడులు వస్తాయని అధికారుల అంచనా. దీనిలో ఉప్పుడు బియ్యం మరాడించడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నారు. ఎఫ్‌సీఐ(Paddy procurement in Karimnagar) సేకరణలో ఆలస్యమే ఇందుకు కారణం. దీంతో వానాకాలం కేటాయించే కోటాలో యాభై శాతానికి మించి ధాన్యం తీసుకోలేమని మిల్లర్లు అధికారులకు చెబుతున్నారు.
కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో రైస్ మిల్లులు ఎక్కువగా ఉండటంతో రాజన్న సిరిసిల్ల(Paddy procurement in Karimnagar) తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన సీఎంఆర్ కోటాను అధికారులు ఈ రెండు జిల్లాలకు కేటాయించారు. వీటిలో సగం వరకు ఉప్పుడు బియ్యం మరాడించి ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 25 శాతానికి మించి సీఎంఆర్ లక్ష్యం చేరుకోలేదు. దసరా వేడుకలు ముగియడంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సేకరణ ప్రారంభమయ్యాక తూకం వేసిన ధాన్యం తరలించాలంటే ముందుగా మిల్లుల(Paddy procurement in Karimnagar) కు ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత గోదాములు.. ఉమ్మడి జిల్లా గోదాముల్లో యాసంగి ధాన్యం నిల్వలే ఉన్నాయి.
* ఉమ్మడి జిల్లా మిల్లుల్లో ధాన్యం నిల్వల పరిస్థితి..
కరీంనగర్ జిల్లాలో యాసంగిలో 4,13,684 మెట్రిక్ టన్నులు కొలుగోలు చేయగా సీఎంఆర్‌కు 4,00,294 మెట్రిక్ టన్నులు అప్పగించాలి. జగిత్యాల జిల్లాలో యాసంగిలో 5,52,261 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా సీఎంఆర్‌కు 3,75,986 మెట్రిక్ టన్నులు అప్పగించాల్సి ఉండగా.. పెద్దపల్లి జిల్లాలో యాసంగిలో 3,93,652 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా సీఎంఆర్‌కు 4,86,781 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగిలో 3,61,388 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా సీఎంఆర్‌కు 2,32,459 టన్నులు ఇవ్వాలి.
* ఈ వానాకాలంలో వరిసాగు విస్తీర్ణం..
- కరీంనగర్ జిల్లాలో 2,69,564 ఎకరాలు
- జగిత్యాలలో 2,94,548 ఎకరాలు
- పెద్దపల్లిలో 2,09,308 ఎకరాలు
- రాజన్న సిరిసిల్లలో 1,72,788 ఎకరాలు
అధిక పంట దిగుబడులు విపణిని ముంచెత్తే అవకాశం ఉన్న ప్రాంతా(Paddy procurement in Karimnagar) ల్లో ధాన్యం రవాణా చేయడం అధికారులకు సవాలుగా మారనుంది. పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్ గోదాంలను ఖాళీ చేయించాలి. మార్కెట్ కమిటీల్లోని(Paddy procurement in Karimnagar) ప్లాట్‌ఫాంల్లో బహిరంగంగా నిల్వచేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నిల్వకు అవకాశం లేని ప్రాంతాల్లో సేకరించిన ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించే ఆలోచనలో అధికారులున్నారు. ఇందుకు తగిన విధంగా వాహనాలు సమకూర్చుకుంటే ఇబ్బందులను అధిగమించవచ్చు.
ఇదీ చదవండి: Huzurabad constituency Voters : ఓటు మీట.. భవిష్యత్‌కు బాట