ETV Bharat / state

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఒకరు మృతి - accident news

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ దుర్ఘటన కరీంనగర్​ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో జరిగింది.

one died in road accident at kotthagattu
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఒకరు మృతి
author img

By

Published : May 17, 2020, 6:53 PM IST

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టులో విషాదం చోటుచేసుకుంది. మత్స్య గిరీంద్ర స్వామి ఆలయం మూల మలుపు వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు దేశాయిపల్లికి చెందిన కూచన ప్రవీణ్(27)గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతని భార్య రాంభీ, కూతురికి తీవ్రగాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.