కరీంనగర్‌లోని వివేకానంద విద్యానికేతన పూర్వ విద్యార్థులు అనాథాశ్రమాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. 2000-01 పదోతరగతి బ్యాచ్‌కి చెందిన పలువురు విద్యార్థులు... వీరబ్రహ్మేంద్రస్వామి అనాథ వృద్ధాశ్రమం, సుభాష్‌నగర్ ముకరంపురలోని అనాథ బాలల ఆశ్రమాలకు నిత్యావసర సరకులు అందించారు.
కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న అనాథలకు సాయం అందిచడంపై ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీకాంత్, బి శ్రీకాంత్, సురేశ్, చంద్రశేఖర్, డాక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జడలు చాస్తున్న మహమ్మారి... పదిరోజుల్లోనే రెట్టింపు కేసులు