కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ అధికారులు శనివారం తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. పట్టణంలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. 9 వేల 664 ఓటర్లు ఉండగా... 4 వేల 930 మహిళా ఓటర్లు ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 711 ఉండగా.... 864 మహిళా ఓటర్లు ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 105 ఉండగా... 56 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 6 వేల 725 బీసీ ఓటర్లు ఉండగా... 3446 మహిళా ఓటర్లు ఉన్నారు. ఒక వెయ్యి 123 మంది ఇతరులు ఉండగా.... 564 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రెండు మినహా మిగిలిన పది వార్డుల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. పురుషుల ఓటర్ల కంటే 196 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల్లో మహిళా ఓట్లు కీలకంగా మారనున్నాయి.
ఇవీ చూడండి: భారీ ధరకు 'దర్బార్' హక్కులు.. 'తలైవా' డబుల్ సెంచరీ