కరీంనగర్ జిల్లాలో నాగసాధువుల పేరుతో కొందరు దోచుకుంటున్నారు. గ్రామాల్లో ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. కార్లలో దిగంబరంగా తిరుగుతూ ప్రజల వద్ద వసూళ్లకు పాల్పడటం జిల్లాలో కలకలం రేపుతోంది.
ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చామంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దోష నివారణ, జాతకాలు చెబుతామంటూ వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో వారిని చూసి ప్రజలు జంకుతున్నారు. తమకు పాప పరిహారంగా కట్నం సమర్పించాలని పట్టుపట్టడంతో విధిలేక వారికి డబ్బులు చెల్లిస్తున్నారు.
గతంలో పోలీసుల కౌన్సిలింగ్
వీరికి రెండేళ్ల క్రితం గంగాధర పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వారి స్వస్థలాలకు పంపారు. గ్రామాల్లో పలుకుబడి ఉన్నవారిని గుర్తించి నేరుగా వారి ఇళ్ల వద్దకు వచ్చి వసూళ్లకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు దృష్టి సారించి అలాంటి వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: Suicide: టిక్‌టాక్ స్టార్ భర్త ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా..?