కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీ ఎదుట వైస్ ఛైర్‌పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో భాగంగా... మున్సిపాలిటీకి మంజూరైన పట్టణ ప్రగతి నిధులను ఛైర్‌పర్సన్ గందె రాధిక, కమిషనర్ కాజేశారని ఆరోపించారు. సమావేశం నుంచి వైస్ ఛైర్‌పర్సన్‌తో సహా పలువురు కౌన్సిలర్లు బయటకు వచ్చారు.
పట్టణ ప్రగతిలో ఛైర్‌పర్సన్, కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 30 వార్డుల్లో రూ.1.86 కోట్లు వార్డుల అభివృద్ధికి కేటాయించకపోయినా... కేటాయించినట్లు చెబుతున్నారని కౌన్సిలర్ మంజుల ఆరోపించారు. పట్టణ ప్రగతిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. ఎజెండా ఛైర్‌పర్సన్, కమిషనర్ సమక్షంలోనే జరుగుతోందని, ఇతర కౌన్సిలర్లను సంప్రదించకుండానే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ నిధుల గోల్‌మాల్‌ని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, కలెక్టర్ శశాంక దృష్టికి తీసుకెళ్తామన్నారు. అన్ని వార్డుల అభివృద్ధి లక్ష్యంగానే ఎజెండా తయారు చేశామని ఛైర్‌పర్సన్ రాధిక చెబుతున్నారు.
ఇదీ చదవండి: పసుపు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పోరాటం