కరీంనగర్ కార్పొరేషన్ సమస్యలకు అడ్డాగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి ఎందరో మంత్రులు మారినా... నగరపాలక సంస్థ పరిధిలోని పలు కాలనీల దుస్థితి మాత్రం ఇప్పటికీ మారలేదు. గాయత్రి నగర్, షాషా మహల్, లక్ష్మీనగర్, అమీర్నగర్ కాలనీల్లో... సరైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వాహణలేక ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా... పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని స్థానికులు మండిపడుతున్నారు. పాలకులు పట్టించుకోకపోవటం వల్ల ఇళ్ల ముందు తాత్కాలిక మురుగు కాలువలు తవ్వుకుని కాలం వెళ్లదీస్తున్నామని గోడు వెళ్లబోసుకున్నారు.
ఎన్నికలప్పుడే హామీలు...
ఎన్నికలు వస్తేనే ఆయా పార్టీల నాయకులు వచ్చి అభివృద్ధి మంత్రం జపిస్తారని... గెలిచాకా ముఖం చాటేస్తున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి మోసం చేస్తున్న నాయకుల ద్వారా... తమ కాలనీలు అభివృద్ధికి నోచుకోవటం పక్కనబెడితే, తీవ్ర అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు.
ఎంత మంది పాలకులు మారినా... తమ తలరాతలు మారకపోవడం దురదృష్టకరమని... ఏ నాయకుడు వచ్చి కాలనీ సమస్యలు తీరుస్తారో వారికే తమ ఓటని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్నగర్ కార్పొరేషన్