కరీంనగర్లో ఎమ్మార్పీఎస్ 26 వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కార్ఖానగడ్డ, రాజీవ్నగర్లలో పారిశుద్ధ్య కార్మికులతో జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులను సన్మానించారు. 26 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ చేసిన ఉద్యమాలతో ఎన్నో ఫలితాలు సాధించామని కో కన్వీనర్ నీర్ల శ్రీనివాస్ తెలిపారు.
ప్రస్తుత కరోనా ఆపద సమయంలో పోరాడుతున్న పారిశుద్ధ్య కార్మికులను 4 వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని... వారికి ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జింక మల్లేశం, బండారి వేణు, కుమ్మరి శంకరయ్య, నక్క సుధాకర్ పాల్గొన్నారు.