నవకేరళ సమాజం కరీంనగర్లో ఓనం వేడుకలు వైభవంగా నిర్వహించింది. ఈ పండుగ సంబరాలకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అతిథిగా హాజరయ్యారు. కేరళ పండుగల్లో ముఖ్యమైన ఓనంను ఘనంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న కేరళ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేరళవాసుల సంప్రదాయ అలంకరణ, వేషధారణ.. వారు చేసిన నృత్యాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు. కేరళీయుల కుటుంబీకులతో కలిసి భోజనం చేశారు. కేరళీయులకు ఎటువంటి ఆపద వచ్చినా తాను అండగా నిలుస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండిః సంప్రదాయాల ప్రతిబింబం.. 'ఓనం' పండుగ ఆరంభం