కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని సీపీ కార్యాలయాన్నిభాజపా కార్యకర్తలు ముట్టడించారు. ఆరెపల్లిలో డ్రైవర్ బాబు శవయాత్ర సందర్భంగా ఓ పోలీసు అధికారి సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా... పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎంపీ బండి సంజయ్‌తో పాటు మాజీ ఎంపీ వివేక్, మందకృష్ణ మాదిగ సహా భాజపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులంతా సీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకొంది. పోలీస్ అధికారిపై చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇవ్వగా... కార్యకర్తలు ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లాన్నొదిలేశాడు'