కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ తలపెట్టిన గాంధీ సంకల్పయాత్ర 3వ రోజూ సాగింది. జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో ప్రారంభమయ్యింది. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని పలువీధుల నుంచి తిరిగారు. ఆయన వెంట భాజపా నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఎంపీ గ్రామీణులతో ముచ్చటించారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: ఆదివాసీల నృత్యం.. తెచ్చింది పరవశం..