ETV Bharat / state

రాజీవ్​ రహదారిలో ప్రమాదాలకు నిలయంగా కాకతీయ కెనాల్​

అత్యంత రద్దీగా ఉండే కరీంనగర్‌-హైదరాబాద్ రాజీవ్‌ ‌రహదారిలో కాకతీయ కెనాల్‌ ప్రమాదాలకు నిలయంగా ఉండేది. దిగువమానేరు జలాశయం నుంచి నిరంతరం నీటి సరఫరా కొనసాగేది. రద్దీగా ఉండే రహదారిలో రెయిలింగ్‌ లేని కాకతీయ కాల్వ వద్ద అనేక ప్రమాదాలు జరిగేవి. వేగంగా వచ్చే వాహనాల లైటింగ్‌ కారణంగా రెయిలింగ్‌ లేని కాకతీయ కాల్వలో పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రమాదాలు చోటు చేసుకున్నా అధికారులు పట్టించుకోలేదు.

author img

By

Published : Oct 24, 2020, 9:29 AM IST

రాజీవ్​ రహదారిలో ప్రమాదాలకు నిలయంగా కాకతీయ కెనాల్​
రాజీవ్​ రహదారిలో ప్రమాదాలకు నిలయంగా కాకతీయ కెనాల్​

కరీంనగర్‌-హైదరాబాద్ రాజీవ్‌ రహదారిలో రెండు ప్రాంతాల్లో టోల్‌గేట్ల ద్వారా పన్నులు వసూలు చేస్తున్నా.. ప్రమాదాలు జరిగే ప్రాంతాలు కూడా అధికమే. ప్రధానంగా దిగువమానేరు జలాశయం నుంచి వరంగల్‌, నల్గొండ జిల్లాలకు నీటిని తరలించే కాకతీయ కాల్వ ప్రమాదాలకు నిలయంగా మారింది. కరీంనగర్‌కు కేవలం 6 కిలోమీటర్ల దూరంలోని కెనాల్‌లో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాల్వపై బ్రిడ్జి తప్ప కాల్వ పక్క రెయిలింగ్ నిర్మించక పోవడం వల్ల ఇప్పటివరకు అనేక వాహనాలు నీళ్లలో పడిపోయాయి. అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నా తగు చర్యలు మాత్రం తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి.

రాత్రివేళ పురుగులతో ఇబ్బందులు

గతేడాది పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం కాల్వలో పడిపోవడం వల్ల మరోసారి కాల్వ వద్ద గోడ నిర్మించాలన్న ప్రతిపాదన రూపొందించారు. దాదాపు ఏడాది తర్వాత కాల్వ పక్కన గోడ నిర్మాణం పూర్తి అయింది. ప్రధానంగా రాత్రి వేళల్లో దిగువమానేరు జలాశయం వద్ద ఏర్పాటు చేసిన వీధిదీపాల కారణంగా పురుగులు అధికంగా ఉంటాయి. వాహనం నడుపుతున్నప్పుడు కళ్లకు అడ్డంగా పురుగులు రావడం వల్ల వాహనాన్ని అదుపు చేయలేక కాల్వలో పడిపోయేవి. దీంతో కరీంనగర్ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు కాల్వలో పడిపోకుండా గోడను నిర్మించారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు తగ్గిపోయినట్టేనని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రేకులతో రెయిలింగ్..

ప్రస్తుతం కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలకు ప్రమాదం లేకపోయినా హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు వచ్చే వాహనాలకు మాత్రం ఇంకా గండం గట్టెక్కలేదు. కేవలం ఒకవైపు మాత్రమే గోడను నిర్మించారు. మరోవైపు నిర్మించకుండా కేవలం రేకులతో రెయిలింగ్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలకు కెనాల్‌ సమీపంలో రోడ్డు పక్కనే చెట్లు అడ్డంగా ఉన్నాయి. అటువైపు కూడా గోడ నిర్మిస్తే ప్రమాదాలు నివారించవచ్చని స్థానికులు చెబుతున్నారు. రోజూ రద్దీగా ఉండే రాజీవ్‌ రహదారిపై ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైన చోట్ల రెయిలింగ్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: మీ "కోటి కొలువులు" ఏమయ్యాయి?: మంత్రి హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.