ఓ వానరం నాలుగు రోజులుగా 60 అడుగుల హనుమాన్ విగ్రహాంపై కూర్చొని స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన చుట్టుపక్కల ప్రజలు, పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చోటు చేసుకుంది.
పట్టణ సమీపంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో నాలుగు రోజులుగా హనుమాన్ విగ్రహంపై కోతి ఉండిపోయింది. అగ్నిమాపక సిబ్బంది నీటితో వానరాన్ని కిందికి దింపే ప్రయత్నం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి తర్వాత దానిని ఎట్టకేలకు కిందకు దించారు.
ఇవీచూడండి: 'ఐటీ కారిడార్ ఖాళీ చేయించడం లేదు.. పుకార్లను నమ్మొద్దు'